కాంగ్రెస్సే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను కాపాడుతోంది..

కాంగ్రెస్సే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను కాపాడుతోంది..
  • అవినీతిలో కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కవలలు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

నర్సాపూర్, వెలుగు : అధికార కాంగ్రెస్ పార్టే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను కాపాడుతోందని, అవినీతిలో ఆ రెండు పార్టీలు కవలలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మెదక్‌‌‌‌ జిల్లా నర్సాపూర్‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో ఎంపీ రఘునందన్‌‌‌‌రావుతో కలిసి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసును రెండేండ్లుగా సాగదీస్తున్నారని, టెక్నాలజీని ఉపయోగించి ఎంక్వైరీ చేసి నెల రోజుల్లోపే శిక్షపడేలా చేయొచ్చన్నారు. కానీ అలా చేయకుండా ఉద్దేశపూర్వకంగానే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను కాపాడుతున్నారన్నారు. మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు బుద్ధి చెప్పాలన్నారు. నర్సాపూర్‌‌‌‌ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర నిధులతో నర్సాపూర్ మున్సిపల్‌‌‌‌ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, రాష్ట్ర కార్యవర్గసభ్యులు మురళీయాదవ్‌‌‌‌, బీజేపీ జిల్లా నాయకులు బుచ్చేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌, గోడ రాజేందర్, రమేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, ఆంజనేయులు, యాదగిరి పాల్గొన్నారు.